పేజీలు

30, డిసెంబర్ 2015, బుధవారం

ఈ వంటనూనెలు ప్రమాదకరం

మనలో చాలామంది వంట నూనెలు ఉపయోగించకుండా వంటలు చేయలేరు. కాని ఈ వంట నూనెలను మీరు కనుక అతి తక్కువగా వాడేవారైతే, మీకు మంచి ఆరోగ్యకర జీవన విధానం ఉంటుంది. మార్కెట్ లో నేడు లభ్యమవుతున్న వంటనూనెలు చాలా వరకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానికరమైన శాట్యురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. చాలామంది గృహిణులు నూనెలపై కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీనితో అవి కూడా కొన్ని అనారోగ్య వంట నూనెలుగానే ఉంటాయి. మరి మీరు ఈ వంటనూనెల కొనుగోలుకు టి.వి. లేదా ప్రకటనలలో చూపే వాటికి ఆకర్షణ కాకండి. అనారోగ్య వంటనూనెలు ఏవో తెలుసుకోండి. వాటిని ఇక ఎప్పుడూ వాడకండి.
అనారోగ్య వంట నూనెలు వాడకూడనివి ..... 
1. పామ్ ఆయిల్ - సాధారణంగా ఈ వంటనూనెను ఆప్రికాలో ఎక్కువగా వాడతారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, ఈజిప్టు, కాంగో మొదలైన దేశాలలోని ప్రజలు అనారోగ్యమైన ఈ వంటనూనె వాడతారు. ఈ దేశాలలో పామ్ ఆయిల్ స్ధానికి ప్రదేశాలలో తయారు చేస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 30 శాతం వరకు శాట్యురేటెడ్ కొవ్వులు ఉండి గుండె ఆరోగ్యానికి చేటు తెస్తాయి. 
2. పామ్ కెర్నెల్ ఆయిల్ - చాలామంది పామ్ ఆయిల్ మరియు పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటేనని భావిస్తారు. మొదటిది పామ్ పండునుండి తీస్తారు.
రెండవది పామ్ ఫ్రూట్ లోని గింజలనుండి తీస్తారు. పామ్ చెట్లు పెరిగే కోస్తా తీరాల వెంబడి ఈ నూనెలు బాగా వాడతారు. అన్ని వంటనూనెలకంటే కూడా పామ్ ఆయిల్ బాగా అనారోగ్యం. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్ లు తయారీ విధానంపై ఆధారపడి 80 నుండి 85 శాతం వరకు ఉంటాయి. 
3. కొబ్బరి నూనె - కొబ్బరి లో కొల్లెస్టరాల్ మరియు కొవ్వులు అధికం. కనుక కొబ్బరి నూనెలో కూడా సాధారణంగా శాట్యురేటెడ్ కొవ్వులు అధికంగానే ఉంటాయి. ఇవి షుమారుగా 17 శాతం పైగా ఉంటాయి. కొబ్బరి నూనె తల వెంట్రుకలకు మంచి పోషణ నిస్తుంది. కాని మీ రక్తనాళాలకు అధికంగా వినియోగిస్తే మంచిది కాదు. కొబ్బరినూనెను అధికంగా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలవారు వాడతారు.
దీనిని సాంప్రదాయంగా ఎన్నో వంటలలో వాడుతున్నప్పటికి వీలైనంతవరకు దీని వాడకాన్ని తగ్గించుకోవటం మంచిది. 
4. జొన్న నూనె - షుమారుగా కొంతకాలం క్రిందట జొన్నవిత్తుల నూనె ఆరోగ్యకరమైన వంటనూనెగా చెప్పబడుతూ మార్కెట్ లోకి వచ్చింది. కాని తర్వాతి రోజులలో అది అనారోగ్యమని దానిలో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండి, కడుపులో మంట ఏర్పడుతుందని తెలియటంతో ఈ నూనె వాడకం వెనుకబడింది. 5. హైడ్రోజనేటెడ్ ఆయిల్ - పాక్షికంగా హైడ్రోజన్ కల ఆయిల్ అని ఉంటే దానిని వాడకండి. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండి మీ రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. తయారీ దారులు పాక్షికం అంటే కొంతమేరకే అని వ్రాసినప్పటికి దానికి తగ్గ హాని జరిగి తీరుతుంది. కనుక మీ వంటలలో హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉపయోగించవద్దు.

ఔషధమూలిక గోరింటాకు


గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటాకు నూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.

గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.

ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పొడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా?????

మంచి రంగులో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. కాంప్లెక్షన్ మాట పక్కన పెడితే... ఒక మూలికగా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే దీనితో పోషకపరమైన ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం.
కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. 
ఇది కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. బిడ్డ ఒంటిరంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ణయిస్తాయి.

తార్కికంగా ఆలోచించి చూస్తే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులకు చాలా మేలు చేస్తాయి. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి ఇష్టపడరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. బహుశా బిడ్డ రంగు కోసం కుంకుమపువ్వు అనే సంప్రదాయం ఇందువల్లనే పుట్టిందనిపిస్తోంది. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి.
ఇక కుంకుమపువ్వును గర్భవతులు వాడే విషయంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి. దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని పిసరంతే వాడాలి.

దేవుని ప్రసాదాలంటే నిర్లక్ష్యమా.. దోషాలు తప్పవు జాగ్రత్త!!

దేవుని ప్రసాదాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా? కుంకుమ, పుష్పాలను ఇంటికి తీసుకొచ్చి.. ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. లేదంటే ఈ ధోరణి దోషంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
దేవాలయంలో భగవంతుడిని దర్శించుకుని పూజ చేయడం.. భగవంతుడి ప్రసాదంగా అర్చకుడు ఇచ్చిన కుంకుమ, పుష్పం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక దేవాలయానికి వెళ్లి వస్తూ ఎదురుపడిన వాళ్లు అక్కడి ప్రసాదాన్ని ఇస్తే, ఇంటికి రాగానే దానిని ఎక్కడో ఒకచోట పెట్టి మరిచిపోవడం చేస్తుంటారు.
 
భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించకపోవడం, ప్రసాదాన్ని పవిత్రంగా భావించకపోవడం వంటివి ఓ రకంగా ఆయనను అవమానపరచడమే అవుతుందని, ఇది దోషంగా మారే ప్రమాదముందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
ఇలాంటి ప్రవర్తన కారణంగా సాక్షాత్తు ఇంద్రుడే ఇబ్బందుల్లో పడినతీరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకసారి దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని వస్తూ వుండగా, దేవేంద్రుడు తారసపడతాడు. వినయ పూర్వకంగా దేవేంద్రుడు నమస్కరించడంతో, తనకి నారాయణుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఆయన దేవేంద్రుడికి ఇస్తాడు.
 
ఆ పుష్పాన్ని అందుకున్న వెంటనే దేవేంద్రుడు దానిని 'ఐరావతం' తలపై పెడతాడు. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదం ఏదైనా అది అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వీకరించాలనీ, భక్తి భావంతో వ్యవహరించాలని చెబుతాడు.
 
స్వామివారి ప్రసాదానికి ఎవరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెడతారో, అలాంటివారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుందంటాడు. లక్ష్మీదేవి లేని చోటు కళావిహీనమై అనేక కష్ట నష్టాలకు వేదికగా మారుతుందని అంటాడు. 
 
దుర్వాస మహర్షి పలుకుల మేరకు అసురుల కారణంగా ఇంద్రు తన పదవిని కోల్పోతాడు. దేవేంద్రుడు కొంతకాలం పాటు నానాఇబ్బందులు పడతాడు. ఆ తరువాత స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు.
 
అందువలన భగవంతుడి ప్రసాదంగా లభించినది ఏదైనా దానిని ఎంతో పవిత్రమైనదిగా భావించాలని ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రసాదాన్ని భవ్యంగా స్వీకరించడం ద్వారా స్వామి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు

బెండకాయ సర్వరోగ నివారణి: బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

బెండకాయతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని వినేవుంటాం. అయితే బెండకాయను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆస్తమా, కొలెస్ట్రాల్, క్యాన్సర్, మధుమేహం, ఉదర సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలను నివారిస్తుందని, బెండకాయ సర్వరోగ నివారణి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
వందగ్రాముల బెండకాయలో.. 
కార్బొహైడ్రేడ్ - 7.45 గ్రాములు 
కొవ్వు - 0.19 గ్రాములు 
విటమిన్స్- రెండు గ్రాములు 
విటమిన్ ఎ - 36 మి. గ్రాములు విటమిన్ సి- 23 మి. గ్రాములు 
విటమిన్ ఇ- 0.27 మి.గ్రాములు 
విటమిన్ కె -  31.3 మి. గ్రాములు 
క్యాల్షియం - 82 మి. గ్రాములు 
ఐరన్ - 0.62 మి. గ్రాములు 
గర్భిణీ మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్ బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. బెండకాయలోని అంటుకునే పీచు అల్సర్‌ను దూరం చేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. 
యాంటీ-యాక్సిడెంట్లు అధికంగా కలిగిన బెండకాయలను మాంచి హెల్త్ టానిక్ అని చెప్పవచ్చు. ఇందులోని పీచు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా గుండెపోటుకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. ఇంకా క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. విటమిన్ సి ఆస్తమా చెక్ పెట్టి.. ఎముకలను గట్టి పరుస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. 
బెండకాయను ఆహారంలో వారానికి రెండు లేదా మూడు సార్లు చేర్చుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బెండలో కెలోరీ తక్కువ. పోషకాలు ఎక్కువ. అందుచేత ఒబిసిటీ దరిచేరదు. ఇంకా కంటి సమస్యలు, దృష్టిలోపాలుండవు.

సగ్గుబియ్యం తినండి.. ఎనర్జిటిక్‌గా ఉండండి

సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలున్నాయి. కార్పొహైడ్రేడ్స్ దాగివున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవడం ద్వారా శరీరం చల్లబడటంతో పాటు ఎనర్జీ లభిస్తుంది. శరీరం ఎప్పుడూ వేడితో ఉంటే సగ్గుబియ్యంతో చేసిన జావను తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
సగ్గు బియ్యంలో కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సగ్గుబియ్యంలో 355క్యాలరీలు, 94గ్రాముల కార్బో హైడ్రేడ్లు, ఫ్యాట్ కలిగివుంటాయి. అందువల్ల సగ్గు బియ్యం తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుంది. 
 
మరీ సన్నగా, బలహీనంగా ఉన్నవారు సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల, ఇది ఎక్కవు శక్తిని అందించడంతో పాటు బలహీనతను పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

జుట్టు నల్లగా నిగనిగలాడేలా చేసే మందారం

జుట్టుకు సరైన పోషణ అందించాలి. వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసం తో తల స్నానం చేయడం వల్ల కొంతైనా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలకుండా కాపాడటంలో మందారం కీలకపాత్ర పోషిస్తుంది.
మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత తలారా స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది.
పోడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టుకోసం : ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత
తలస్నానం చేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి జుట్టుకోసం : ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
వెంట్రుకలు చిట్లిపోకుండా : వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జట్టుకి పట్టించాలి జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలు రోజు తీసుకునే ఆహారంలో ఉదెల చూసుకోవాలి.
జుట్టురాలిపోవడానికి కారణం అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు. మనం పై మెరుగులు ఎన్ని చేసినా జుట్టు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన ఆందోళనలకు గురికాకుండామనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

నిగనిగలాడే శిరోజాల కోసం

నిగనిగలాడే శిరోజాలను కోరుకోని వారెవరుంటారు! అయితే, ఈ రోజుల్లో యువతలో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. అందుకు నిపుణులు కొన్ని సూత్రాలు చెబుతున్నారు. తలంటుకునే ముందు ఆముదం కానీ, ఆలివ్, ఆల్మండ్ నూనెలు కానీ... వీటిలో ఏదైనా ఒకదానికి విటమిన్ 'ఈ' క్యాప్సూల్ కలిపి తలకు పట్టించాలి. ఓ 20 నిమిషాల పాటు ఈ మిశ్రమంతో మసాజ్ చేయాలి. అనంతరం తలస్నానం చేయాలి. 

యోగర్ట్ కు కోడిగుడ్ల తెల్ల సొన కలిపి తలకు పట్టిస్తే అది హెయిర్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. తద్వారా జుట్టు కాంతులీనుతుంది. తేనెకు పెరుగు కలిపి జుట్టుకు మాస్క్ లా ఉపయోగించవచ్చు. ఆ మిశ్రమం మంచి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది. ఇక, బాగా పండిన అరటికాయలు రెండింటిని మెత్తటి గుజ్జులా చేసి, దానికి రెండు టేబుల్ స్పూన్ల గుడ్డు పచ్చసొన-నిమ్మరసం మిశ్రమం, ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పూయాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

మనం ఇష్టంగా తినే శనగలతోనూ జుట్టును సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే, మూడు టేబుల్ స్పూన్ల శెనగలను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా రుబ్బి, దానికి ఓ కోడిగుడ్డు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు యోగర్ట్ కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.

EENADU EPAPER HEALTH TOPCKS

EENADU PAPER

ఇవి తింటే మగవారు మంచి ‘వీర్యు’లవుతారట !

మగవారిలో కనిపించే ఇన్‌ఫెర్టైల్‌ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్‌ కౌంట్‌ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్‌ కౌంట్‌ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. ఈ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. ప్లాస్టిక్‌ను అధికంగా వినియోగించడం, పురుగుల మందులు, రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోవడం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం వంటివి వీర్య కణాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యను ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. విటమిన్‌-సి, ఇ, ఫోలేట్‌ యాసిడ్‌ మరియు జింక్‌ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కింద సూచించిన పదార్థాలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ను భారీగా పెంచడంలో తోడ్పడతాయి. 1) వెల్లుల్లి: వెల్లుల్లి ఉండే ‘ఎలిసిన్‌’ అనే పదార్థం స్పెర్మ్‌ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పదార్థం జననాంగాలకు రక్తం సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సెలూనియమ్‌, బీ6 స్పెర్మ్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. 2) గుడ్లు: ఎగ్స్‌లో విటిమన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వృషాణాల్లో కణాల నాశనాన్ని అరికడుతుంది. అలాగే గుడ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచుతాయి. 3) అరటి: అరటి పళ్లలో బ్రొమేలియన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది సెక్స్‌ హార్మోన్ల విడుదలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఎ, బీ1, సి విటమిన్‌లు వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి. 4) డార్క్‌ చాకొలెట్స్‌: వీటిల్లో ఉండే ఎల్‌-అర్గినిన్‌ హెచ్‌సీఎల్‌ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.

19, డిసెంబర్ 2015, శనివారం

రైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి. తేనే మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తేనే అందులో మొదటిది. చర్మానికి తేనే రాయటం వలన త్వరగా ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది 'యాంటీ-బ్యాక్టీరియా' గుణాలను కలిగి ఉండటం వలన. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది. దోసకాయ ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో, దోసకాయ ఎలా మర్చిపోతున్నారు? ఫ్రిజ్ నుండి తీసిన దోసకాయల నుండి తయారు చేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్ళకు వాడటం వలన హైడ్రెటింగ్ భావనను పొందుతారు, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను కూడా త్రోలగిస్తుంది. మీరు నల్లటి మచ్చలను కలిగి ఉన్నారా.. అయితే తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి. అవసరమైన నూనెలు మీరు ఇంట్లోనే స్వతహాగా సౌందర్య చిట్కాలను అనగా కొన్ని రకాల నూనెలను ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఆలివ్ ఆయిల్, జోజోబ ఆయిల్ లేదా బాదం వంటి నూనెలు మీ చర్మం పైన ఉండే దుమ్ము, ధూళిలను పోగొడుతాయి. పడుకోటానికి ముందుగా ఆలివ్ పాయిల్ లేదా సన్ ఫ్లవర్ నూనెలను వాడటం వలన మీరు త్వరిత ఫలితాలను పొందుతారు. భారత ఉన్నత జాతి పండు(టమాట) భారత ఉన్నత జాతి పండు రసంతో ముఖాన్ని కడగటం వలన, సహజ సిద్ద మెరుపు పొందుతారు. పండును ఉడకబెట్టి, వచ్చిన రసాన్ని రసాన్ని చల్లబరచండి, దీనితో ముఖం కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. పాలు మీ చర్మం జిడ్డుగా ఉందా, అయితే చల్లటి మంచు గడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి; దీని వలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి, సౌందర్య చర్మం కోసం జీవన శైలిలో చాలా రకాల చిట్కాలను అనుసరించాలి. మీ చర్మం పునఃతాజీకర చెందుటకు- ట్యుమెరిక్ కలిపిన పాలలో శుభ్రమైన, మృదువైన గుడ్డను నానబెట్టండి. కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకోండి 20 నిమిషాల తరువాత కడిగివేయండి. అందం అనేది సహజంగా వస్తుంది మరియు ఇంట్లో ఉండే కొన్ని రకాల సహజ సౌందర్య చిట్కాలు వాడటం వలన ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

18, డిసెంబర్ 2015, శుక్రవారం

బరువు తగ్గడానికి ప్రతిరోజు ఆచరించాల్సిన నియమాలు.

1) మొట్టమొదటిగా బరువు తగ్గి 
, ఆరోగ్య్యాన్ని పొందాలి అనే ఒక 
లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.

2) ఉదయం లేవగానే పొట్ట 
భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.


3) తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగాలి.

4) 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి .

5) 10 నిముషాలు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి .
6) స్నానానికి వేడి నీళ్ళు ఉపయోగించాలి .
7) 9 గంటల్లోపు బ్రేక్ఫాస్ట్ పుష్టికరంగా ( పోషకాలు ఉండేట్లు ) తీసుకోవాలి .
8) 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి .
9) 9 గంటల్లోపు రాత్రి బోజనం ముగించుకోవాలి .
10) c -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి , నారింజ , కమల , నిమ్మ , స్ట్రాబెర్రీ , ఆపిల్ , బెర్రీస్ , తీసుకోవాలి .
11) బోజనంలో ఆకుకూరలు , నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి .
12) రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి .
13) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి .
14) బయట దొరికే జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండాలి .
15) రాత్రి వేళ కనీసం 7 గంటలు నిద్ర ఉండేట్లు , ప్రశాంతంగా నిద్ర పోవాలి .
ఇలా చేస్తే మీ లక్ష్యం నెరవేరినట్లే , అధిక బరువు నుండి విముక్తి పొందండి , ఆరోగ్యవంతులుగా జీవించండి .

ముడతలు తగ్గాలంటే...

గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.


రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది