పేజీలు

30, డిసెంబర్ 2015, బుధవారం

ఈ వంటనూనెలు ప్రమాదకరం

మనలో చాలామంది వంట నూనెలు ఉపయోగించకుండా వంటలు చేయలేరు. కాని ఈ వంట నూనెలను మీరు కనుక అతి తక్కువగా వాడేవారైతే, మీకు మంచి ఆరోగ్యకర జీవన విధానం ఉంటుంది. మార్కెట్ లో నేడు లభ్యమవుతున్న వంటనూనెలు చాలా వరకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానికరమైన శాట్యురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. చాలామంది గృహిణులు నూనెలపై కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీనితో అవి కూడా కొన్ని అనారోగ్య వంట నూనెలుగానే ఉంటాయి. మరి మీరు ఈ వంటనూనెల కొనుగోలుకు టి.వి. లేదా ప్రకటనలలో చూపే వాటికి ఆకర్షణ కాకండి. అనారోగ్య వంటనూనెలు ఏవో తెలుసుకోండి. వాటిని ఇక ఎప్పుడూ వాడకండి.
అనారోగ్య వంట నూనెలు వాడకూడనివి ..... 
1. పామ్ ఆయిల్ - సాధారణంగా ఈ వంటనూనెను ఆప్రికాలో ఎక్కువగా వాడతారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, ఈజిప్టు, కాంగో మొదలైన దేశాలలోని ప్రజలు అనారోగ్యమైన ఈ వంటనూనె వాడతారు. ఈ దేశాలలో పామ్ ఆయిల్ స్ధానికి ప్రదేశాలలో తయారు చేస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 30 శాతం వరకు శాట్యురేటెడ్ కొవ్వులు ఉండి గుండె ఆరోగ్యానికి చేటు తెస్తాయి. 
2. పామ్ కెర్నెల్ ఆయిల్ - చాలామంది పామ్ ఆయిల్ మరియు పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటేనని భావిస్తారు. మొదటిది పామ్ పండునుండి తీస్తారు.
రెండవది పామ్ ఫ్రూట్ లోని గింజలనుండి తీస్తారు. పామ్ చెట్లు పెరిగే కోస్తా తీరాల వెంబడి ఈ నూనెలు బాగా వాడతారు. అన్ని వంటనూనెలకంటే కూడా పామ్ ఆయిల్ బాగా అనారోగ్యం. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్ లు తయారీ విధానంపై ఆధారపడి 80 నుండి 85 శాతం వరకు ఉంటాయి. 
3. కొబ్బరి నూనె - కొబ్బరి లో కొల్లెస్టరాల్ మరియు కొవ్వులు అధికం. కనుక కొబ్బరి నూనెలో కూడా సాధారణంగా శాట్యురేటెడ్ కొవ్వులు అధికంగానే ఉంటాయి. ఇవి షుమారుగా 17 శాతం పైగా ఉంటాయి. కొబ్బరి నూనె తల వెంట్రుకలకు మంచి పోషణ నిస్తుంది. కాని మీ రక్తనాళాలకు అధికంగా వినియోగిస్తే మంచిది కాదు. కొబ్బరినూనెను అధికంగా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలవారు వాడతారు.
దీనిని సాంప్రదాయంగా ఎన్నో వంటలలో వాడుతున్నప్పటికి వీలైనంతవరకు దీని వాడకాన్ని తగ్గించుకోవటం మంచిది. 
4. జొన్న నూనె - షుమారుగా కొంతకాలం క్రిందట జొన్నవిత్తుల నూనె ఆరోగ్యకరమైన వంటనూనెగా చెప్పబడుతూ మార్కెట్ లోకి వచ్చింది. కాని తర్వాతి రోజులలో అది అనారోగ్యమని దానిలో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండి, కడుపులో మంట ఏర్పడుతుందని తెలియటంతో ఈ నూనె వాడకం వెనుకబడింది. 5. హైడ్రోజనేటెడ్ ఆయిల్ - పాక్షికంగా హైడ్రోజన్ కల ఆయిల్ అని ఉంటే దానిని వాడకండి. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండి మీ రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. తయారీ దారులు పాక్షికం అంటే కొంతమేరకే అని వ్రాసినప్పటికి దానికి తగ్గ హాని జరిగి తీరుతుంది. కనుక మీ వంటలలో హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉపయోగించవద్దు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి