పేజీలు

18, డిసెంబర్ 2015, శుక్రవారం

ముడతలు తగ్గాలంటే...

గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.


రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది

1 కామెంట్‌: