పేజీలు

30, డిసెంబర్ 2015, బుధవారం

బెండకాయ సర్వరోగ నివారణి: బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

బెండకాయతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని వినేవుంటాం. అయితే బెండకాయను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆస్తమా, కొలెస్ట్రాల్, క్యాన్సర్, మధుమేహం, ఉదర సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలను నివారిస్తుందని, బెండకాయ సర్వరోగ నివారణి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
వందగ్రాముల బెండకాయలో.. 
కార్బొహైడ్రేడ్ - 7.45 గ్రాములు 
కొవ్వు - 0.19 గ్రాములు 
విటమిన్స్- రెండు గ్రాములు 
విటమిన్ ఎ - 36 మి. గ్రాములు విటమిన్ సి- 23 మి. గ్రాములు 
విటమిన్ ఇ- 0.27 మి.గ్రాములు 
విటమిన్ కె -  31.3 మి. గ్రాములు 
క్యాల్షియం - 82 మి. గ్రాములు 
ఐరన్ - 0.62 మి. గ్రాములు 
గర్భిణీ మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్ బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. బెండకాయలోని అంటుకునే పీచు అల్సర్‌ను దూరం చేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. 
యాంటీ-యాక్సిడెంట్లు అధికంగా కలిగిన బెండకాయలను మాంచి హెల్త్ టానిక్ అని చెప్పవచ్చు. ఇందులోని పీచు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా గుండెపోటుకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. ఇంకా క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. విటమిన్ సి ఆస్తమా చెక్ పెట్టి.. ఎముకలను గట్టి పరుస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. 
బెండకాయను ఆహారంలో వారానికి రెండు లేదా మూడు సార్లు చేర్చుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బెండలో కెలోరీ తక్కువ. పోషకాలు ఎక్కువ. అందుచేత ఒబిసిటీ దరిచేరదు. ఇంకా కంటి సమస్యలు, దృష్టిలోపాలుండవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి