నిగనిగలాడే శిరోజాలను కోరుకోని వారెవరుంటారు! అయితే, ఈ రోజుల్లో యువతలో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. అందుకు నిపుణులు కొన్ని సూత్రాలు చెబుతున్నారు. తలంటుకునే ముందు ఆముదం కానీ, ఆలివ్, ఆల్మండ్ నూనెలు కానీ... వీటిలో ఏదైనా ఒకదానికి విటమిన్ 'ఈ' క్యాప్సూల్ కలిపి తలకు పట్టించాలి. ఓ 20 నిమిషాల పాటు ఈ మిశ్రమంతో మసాజ్ చేయాలి. అనంతరం తలస్నానం చేయాలి.
యోగర్ట్ కు కోడిగుడ్ల తెల్ల సొన కలిపి తలకు పట్టిస్తే అది హెయిర్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. తద్వారా జుట్టు కాంతులీనుతుంది. తేనెకు పెరుగు కలిపి జుట్టుకు మాస్క్ లా ఉపయోగించవచ్చు. ఆ మిశ్రమం మంచి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది. ఇక, బాగా పండిన అరటికాయలు రెండింటిని మెత్తటి గుజ్జులా చేసి, దానికి రెండు టేబుల్ స్పూన్ల గుడ్డు పచ్చసొన-నిమ్మరసం మిశ్రమం, ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పూయాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
మనం ఇష్టంగా తినే శనగలతోనూ జుట్టును సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే, మూడు టేబుల్ స్పూన్ల శెనగలను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా రుబ్బి, దానికి ఓ కోడిగుడ్డు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు యోగర్ట్ కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి