పేజీలు

30, డిసెంబర్ 2015, బుధవారం

ఇవి తింటే మగవారు మంచి ‘వీర్యు’లవుతారట !

మగవారిలో కనిపించే ఇన్‌ఫెర్టైల్‌ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్‌ కౌంట్‌ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్‌ కౌంట్‌ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. ఈ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. ప్లాస్టిక్‌ను అధికంగా వినియోగించడం, పురుగుల మందులు, రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోవడం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం వంటివి వీర్య కణాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యను ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. విటమిన్‌-సి, ఇ, ఫోలేట్‌ యాసిడ్‌ మరియు జింక్‌ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కింద సూచించిన పదార్థాలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ను భారీగా పెంచడంలో తోడ్పడతాయి. 1) వెల్లుల్లి: వెల్లుల్లి ఉండే ‘ఎలిసిన్‌’ అనే పదార్థం స్పెర్మ్‌ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పదార్థం జననాంగాలకు రక్తం సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సెలూనియమ్‌, బీ6 స్పెర్మ్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. 2) గుడ్లు: ఎగ్స్‌లో విటిమన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వృషాణాల్లో కణాల నాశనాన్ని అరికడుతుంది. అలాగే గుడ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచుతాయి. 3) అరటి: అరటి పళ్లలో బ్రొమేలియన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది సెక్స్‌ హార్మోన్ల విడుదలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఎ, బీ1, సి విటమిన్‌లు వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి. 4) డార్క్‌ చాకొలెట్స్‌: వీటిల్లో ఉండే ఎల్‌-అర్గినిన్‌ హెచ్‌సీఎల్‌ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి